Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (ఐపీఇ)లో ఆయా కోర్సుల ప్రవేశానికి ఈ నెల 19, 20 తేదీల్లో గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐపీఇకి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) నుంచి మరోసారి గుర్తింపు లభించిందని చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో ఎన్ఐఆర్ఎఫ్ నుంచి ర్యాంకు పొందిన ఏకైక మేనేజ్మెంట్ సంస్థ ఐపీఇ అని తెలిపారు.
రెండు సంవత్సరాల వ్యవధి కలిగిన పీజీడీఎం, పీజీడీఎం - బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పీజీడీఎం-బీఐఎఫ్), పీజీడీఎం - ఇంటర్నేషనల్ బిజినెస్ (పీజీడీఎం-ఐబీ), పీజీడీఎం -మార్కెటింగ్ (పీజీడీఎం-ఎం), పీజీడీఎం-హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ (పీజీడీఎం-హెచ్ఆర్ఎం) కోర్సులను అందిస్తున్నట్టు వివరించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు, ఆఖరు సంవత్సరం పరీక్ష రాసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ జె.కిరణ్మయి, అడ్మిషన్స్ హెడ్ డాక్టర్ ఎం.మెహర్ కరుణ, పీఆర్ కో ఆర్డినేటర్ డాక్టర్ షహీన్ తదితరులు పాల్గొన్నారు.