Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆప్ ఇండియా (ఐసీఏఐ) సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (ఎస్‌ఐఆర్‌సీ)కి నూతన కార్యవర్గం ఎన్నికైంది. గురువారం చెన్నైలో ఎస్‌ఐఆర్‌సీ 249వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-2023 సంవత్సరానికిగాను చైర్మెన్‌గా సీఏ చినమస్థాన్ తలకాయల, వైస్ చైర్మెన్‌గా ఎస్.పన్నా రాజ్, కార్యదర్శిగా నరేష్ చంద్ర గెల్లి, కోశాధికారిగా ఆర్.సౌందర రాజన్‌తో పాటు సదరన్ ఇండియా ఛార్టర్డ్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎస్ఐసీఏఎస్ఏ) చైర్మెన్‌గా సీఏ పి.సతీషన్ నామినేట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎక్స్అఫిషియో రీజినల్ కౌన్సిల్ సభ్యులు మండవ సునీల్ కుమార్ కూడా పాల్గొన్నారు.