Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో బీజేపీ పిల్ డిస్మిస్
హైదరాబాద్-నవతెలంగాణ బ్యూరో
రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఖానామెట్ గ్రామాల్లోని 44.94 ఎకరాలు, 14.92 ఎకరాలను అమ్మేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది. భూములు అమ్మడానికి వీల్లేదని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి వేసిన పిల్‌ను కొట్టేసింది. వాటిని అమ్మకుండా ఉత్తర్వుల జారీ చేసేందుకు యాక్ట్‌లో నిబంధనలు ఏమీ లేవని చెప్పింది. భూముల్ని అమ్మేటప్పుడు పారదర్శకంగా చర్యలు ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. బహిరంగవేలం వేయాలనీ, ఈ టెండర్లను పిలవాలని చెప్పింది. పిల్‌ను కొటేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం ఆదేశాలను జారీ చేసింది. రెండు గ్రామాల్లో ఖరీదైన భూముల్ని ప్రభుత్వం వేలం వేసి ఇతర అవసరాలకు వినియోగిస్తే భవిష్యత్‌లో ప్రజావసరాల కోసం భూమి ఎక్కడి నుంచి తెస్తారని పిటిషనర్ ప్రశ్నించారు.