Authorization
Tue April 01, 2025 07:31:12 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను చేసుకోవడంలో తప్పేముందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పుట్టిన రోజు వేడుకలకు, నిరుద్యోగానికేం సంబంధముందని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియాపాయింట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉద్యోగాలిస్తామంటూ సీఎం కేసీఆర్ మాట తప్పిన మాట వాస్తవమేనన్నారు. నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారన్నదీ కూడా నిజమేనని చెప్పారు. అయితే జన్మదిన వేడుకలు చేసుకోకూడదనేది సరైందికాదని అభిప్రాయపడ్డారు.