Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈ నెల 23న సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సీఎం అదే రోజు ప్రారంభించనున్నట్టు తెలిపారు. సీఎం పర్యటించనున్న ప్రాంతాలను గురువారం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, సీపీ ఎన్ శ్వేత తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.