Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మొదలుకుని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా తమ శుభాకాంక్షలను తెలిపారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమకారుడు కేసీఆర్ అని, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన పరిపాలనాదక్షుడని వారు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ సేవలు మున్ముందు దేశానికీ ఎంతో అవసరమని వారు అభిప్రాయాలు, వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
అదే సందర్భంలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లోని కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పండుగ వాతావరణంలో ఘనంగానిర్వహించారు. సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ జీవిత చరిత్ర లను తెలిపే పలు డాక్యుమెంటరీలు విడుదల చేశారు.
సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ చిరంజీవి, రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్ తదితరులున్నారు.
రాష్ట్రంలో కార్యక్రమాలు
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, హౌంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొన్నారు.
లండన్లో.....
ఎన్నారై టీఆర్ఎస్ యుకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి నాయకత్వంలో లండన్లో జన్మదిన వేడుకలను నిర్వహించారు. సీఎం నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, స్థానిక ''ఎల్స్ట్రీ బోరెంహూడ్ '' కౌన్సిలర్ ప్రభాకర్ ఖాజా, ఎన్నారై తెరాస నాయకులు నవీన్ రెడ్డి, సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవాపేట్, మల్లా రెడ్డి, సేరు సంజరు, వెంకట్ రెడ్డి, శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, సత్యం రెడ్డి కంది, వీర ప్రవీణ్ కుమార్, అబుజాఫర్, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్ పులుసు, రవి రేతినేని, సురేష్ బుడగం, శ్రీకాంత్ జెల్ల, సజన్ రెడ్డి చాడా, సత్యపాల్ పింగళి, రమేష్ ఎసెంపల్లి, మధు రెడ్డి, గణేష్ పస్తం, పథ్వీ రావుల మరియు ప్రవాస సంఘాల నాయకులు పవిత్రా రెడ్డి, శుష్మునా రెడ్డి, స్వాతి, మాధవ్, శ్రీకాంత్ ముదిరాజ్, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శైలజ, నంతిని, విద్య, అపర్ణ, పావని తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.
ట్విట్టర్లో....
హ్యాపీ బర్త్ డే టూ కేసీఆర్ అంటూ చేసిన ట్వీట్ డ్రెండ్ అయింది. పలువురు ప్రముఖులు ట్వీట్ ద్వారా సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.