Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీయూసీ చైర్మెన్ జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రభుత్వరంగ సంస్థల కమిటీ (పీయూసీ) చైర్మెన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వానికి తాను లేఖ రాస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ...అత్యంత ఘనంగా నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను చూసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.