Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సగం ప్రశ్నలకే జవాబు రాసే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఛాయిస్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సగం ప్రశ్నలకే జవాబులు రాసే అవకాశం కల్పిస్తున్నది. అంటే ఛాయిస్‌ను 50 శాతానికి పెంచింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించాలని ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. జరగనున్నాయి. అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశ్నాపత్రాల రూపకల్పన, ముద్రణ వంటి పనులపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) అధికారులు నిమగమయ్యారు. త్వరలోనే మోడల్ ప్రశ్నాపత్రాలను షషష.రషవత్ీ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో పొందుపరిచే అవకాశమున్నది. మ్యాథమెటిక్స్‌లో సెక్షన్ 1లో 12 ప్రశ్నల్లో ఆరింటికి సమాధానాలు రాస్తే సరిపోతుంది. సెక్షన్ 2లో ఎనిమిది ప్రశ్నల్లో నాలుగింటికి జవాబులు రాయాల్సి ఉంటుంది. సెక్షన్ 3లోనూ ఎనిమిది ప్రశ్నలుంటే నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ విద్యార్థులకు 50 శాతం ఛాయిస్‌తో ప్రశ్నాపత్రం రూపొందించారు.