Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి - ఎస్బీఐ మధ్య ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కార్పోరేట్ శాలరీ అకౌంట్ ఉంటే ఒక్కో ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం వర్తింస్తుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఎస్బీఐ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్, సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్ బలరాం ఒప్పందం పత్రంపై శుక్రవారం సంతకాలు చేసుకున్నారు.ఈ ఒప్పందం మార్చి నాలుగవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈ బీమా సౌకర్యం పరిధిలోకి సంస్థలోని 35వేల మంది ఉద్యోగులు వస్తారని వారు తెలిపారు. యాజమాన్యం విజ్ఞప్తిపై కార్మికుల ఖాతాలన్నింటినీ కార్పోరేట్ శాలరీ అకౌంట్లుగా మార్చి ప్రమాద బీమా మొత్తాన్ని రూ. 20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్టు ఎస్బీఐ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ వివరించారు. దీనికి ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండవన్నారు. శాశ్వత అంగ వైకల్యం జరిగిన సందర్భం ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లిస్తారనీ, పాక్షిక అంగ వైకల్యానికి రూ.20 లక్షల వరకు చెల్లిస్తారని చెప్పారు. ఇవి కాకుండా పలు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు.