Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు విద్యార్థులు మృతి
- నాగరకర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
నవతెలంగాణ - కల్వకుర్తి
స్నేహితుడు పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి ముగ్గురు ఫ్రెండ్స్ మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నల్లగొండ జిల్లా వాసులు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని మార్చాల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నల్లగొండ జిల్లాకు చెందిన అరవింద్ (25), శిరీష (23), కిరణ్మయి (20)తో పాటు రేణుక స్నేహితుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లాలోని వెల్దండ మండల కేంద్రానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో జడ్చర్ల మీదుగా హైదరాబాద్ వెళ్లే క్రమంలో తెల్లవారు జామున మార్చాల సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.మరో విద్యార్థిని రేణుక తీవ్రంగా గాయపడింది.ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలను హైదరాబాద్ తరలించారు. కాగా, వారు చదువుకుంటూ హైదరాబాద్లో హాస్టల్లోఉంటున్నట్టు తెలిసింది.