Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ నాలుగో మహాసభలు శని, ఆదివారాల్లో హైదరాబాద ్లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు ఆ యూనియన్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎ.నాగేశ్వర్ రావు తెలిపారు. శుక్రవారం ఎస్వీకేలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రారంభ సెషన్‌కు ప్రధాన వక్తగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు వక్తలుగా సీఐటీయూ కార్యదర్శి జె.వెంకటేష్, ఎఫ్ఎంఆర్ఏఐ అధ్యక్షులు రమేశ్ సుందర్, కార్యదర్శి సునీల్ కుమార్, టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.రాజుభట్ వక్తలుగా పాల్గొంటారని చెప్పారు. సేల్స్ రిప్రజెంటీటివ్స్ హక్కులను సాధించడంతో పాటు ఔషధాలు, వైద్య పరికరాలపై జీరో జీఎస్టీ, ప్రభుత్వరంగంలోనే ఫార్మా ఉండాలి, ప్రభుత్వాస్పత్రుల్లో కనీస వసతులు లేకపోవటం తదితరాంశాలను మహాసభలో చర్చిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై దేశవ్యాప్తంగా మార్చి 28, 29న జరగనున్న నిరసనల్లో భాగస్వాములయ్యే తీర్మానాన్ని ప్రవేశపెడతా మన్నారు. వీటితో పాటు కొన్ని కంపెనీలు ఉద్యోగులను వేధిస్తున్నా యనీ, వాటిపై పోరాటానికి అవసరమైన కార్యాచరణ చేపడుతు న్నారు. మహాసభలో రాబోయే రెండేండ్ల కాలానికి కార్యాచరణతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని తెలిపారు. టీఎంఎస్ఆర్ యూ ప్రధాన కార్యదర్శి ఐ.రాజుభట్, ఎఫ్ఎంఆర్ఏఐ కార్యదర్శి కె.సునీల్ కుమార్, టీఎంఎస్ఆర్ యూ కార్యదర్శి పి.వి.ఎస్.ఏ.ప్రసాద్, కోశాధికారి భాను కిరణ్ పాల్గొన్నారు.