Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సమ్మక్క జాతరలో టీఎస్ఆర్టీసీకి ఊహించినంత ఆదాయం రాలేదని ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. సంస్థను గాడిలో పెట్టేందుకు మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌తో కలిసి తీవ్రంగ కృషి చేస్తున్నామనీ, సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారని అన్నారు. శనివారంనాడిక్కడి బస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థలో1,200మందికి కారుణ్య నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. మూడు వేల మంది రిటైర్మెంట్లకు బెనిఫిట్స్ చెల్లించేందుకు రూ.500కోట్లు అవసరమని చెప్పారు. సంస్థకు 2, 828 కొత్త బస్సులు అవసరమనీ, కొన్నింటిని మోడిఫై చేస్తున్నామనీ,. కొత్తగా రూ.90కోట్లతో 400 బస్సులు కొనుగోలు చేస్తామని వివరించారు. తుక్కు (స్క్రాప)్ ద్వారా కొంత ఆదాయం వస్తుందని తెలిపారు.
శివాజీ విగ్రహం పేరుతో రాజకీయం
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శివాజీ విగ్రహావిష్కరణ పేరుతో రాజకీయం చేస్తున్నారని బాజిరెడ్డి గోవర్థన్ విమర్శించారు. ఎంపీగా గెలిచి రెండున్నరేండ్లు అవుతున్నా ఆయన నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.