Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి
- ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ-ములుగు/వాజేడు
ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే నలుగురు ప్రాణం కోల్పోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం వద్ద ఆర్టీ బస్సు, కారు బలంగా ఢకొీన్నాయి. ఈ ఘటనలో వాజేడు మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బుద్ధ కళ్యాణ్(26), కమ్మంపాటి శ్రీను(45), కమ్మంపాటి సుజాత(40), కమ్మంపాటి రమేష్(48) అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అలాగే, అదే గ్రామానికి చెందిన కమ్మంపాటి జ్యోతి(42) తీవ్రంగా గాయపడగా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.