Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల శాఖ ఏటా మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రంగస్థల ప్రముఖులు జెఎల్ నరసింహారావు పేరిట యువ పురస్కారాలను ప్రదానం చేస్తున్నది. ఈ క్రమంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నాటక రంగంలో వివిధ విభాగాల్లో నటన, దర్శకత్వం, రచన, మేకప్, రంగాలంకరణ, ఇతర సాంకేతిక అంశాల్లో కృషి చేసిన 35 ఏండ్ల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.