Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిరుదొడ్డి
అప్పుల బాధతో గీత కార్మికుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం మల్లుపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బట్టికాడి నర్సింలు(38) జీవనోపాధి కోసం బొంబాయికి వలస వెళ్లాడు. తండ్రి అనారోగ్యానికి గురవడంతో తిరిగి గ్రామానికి వచ్చాడు. మెదక్ జిల్లా చేగుంట మండలం కొండాపూర్ గ్రామంలో చారు హోటల్ పెట్టి కుటుంబాన్ని పోషించేవాడు. కొన్ని రోజుల కిందట తండ్రి మృతిచెందాడు. దానికితోడు కుటుంబ అవసరాల రీత్యా, బొంబాయి వెళ్లడానికి సుమారు రూ.8 లక్షల వరకు అప్పు అయింది. దీంతో అప్పు తీర్చేమార్గం తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన నర్సింలు ఇటీవల పురుగుల మందు ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. శుక్రవారం రాత్రి మృతిచెందాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ సిద్ది భారతి భూపతి గౌడ్, గ్రామస్తులు కోరారు.