Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 2020-21 విద్యాసంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్టీఎస్ఈ స్టేజ్-2 పరీక్షల్లో శ్రీ చైతన్య ఆలిండియా రికార్డు నెలకొల్పింది. ఇందులో తమ విద్యార్థులు 162 మంది విద్యార్థులు స్కాలర్షిప్ పొందటానికి అర్హత సాధించారని శ్రీ చైతన్య అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సీమ తెలిపారు. ఈ ఎన్టిఎస్ఈ స్కాలర్షిప్ సాధించిన ప్రతి విద్యార్థికి పిహెచ్డీ విద్యను అభ్యసించేవరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం అందచేయబడుతుందని ఆమె తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 54 మంది, తెలంగాణ నుంచి 35 మంది విద్యార్థులు, కర్నాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి 73 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం వెలువడిన ఎన్టిఎస్ఈ ఫలితాల్లో మరే ఇతర విద్యా సంస్థ శ్రీ చైతన్య సాధించిన సెలక్షన్లను సాధించలేదని అన్నారు. గత 11 ఏండ్లుగా శ్రీ చైతన్య స్కూల్-టెక్నో కరిక్యులమ్ ఎన్టిఎస్ఈలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్టిఎస్ఈలో నెం.1గా కొనసాగుతుందని సీమ కొనియాడారు. అనితర విజయానికి కారణమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఛైర్మెన్ బి.యస్రావు అభినందనలు తెలిపారు.