Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూపరిపాలన శాఖను బలోపేతం చేయాలనీ, వీఆర్వోలను ఆ శాఖలోనే కొనసాగించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శి వినరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో వారు సర్దుబాటు అధ్యయన కమిటీ చైర్మెన్ శేషాద్రిని కలిశారు. వీఆర్వోల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు వెంకన్న, ప్రతిభ, తదితరులు పాల్గొన్నారు.
వీఆర్వోలకు అన్యాయం జరిగితే న్యాయపోరాటం చేస్తాం : వీఆర్వోల సంక్షేమ సంఘం
వీఆర్వోలకు సర్వీసుపరంగా అన్యాయం జరిగితే న్యాయపోరాటం చేస్తామనీ, ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేందర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరాళే సుధాకర్ ప్రకటించారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని విన్నవించారు.