Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే రద్దు చేయాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓపక్క డీజిల్, పెట్రోల్‌పైన ఎక్సైజ్ డ్యూటీని రూ.10, రూ.5 చొప్పున తగ్గించామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన డైరెక్ట్‌గా కంపెనీ నుంచి కొనుగోలు చేసే కొనుగోలుదారులకు లీటర్ డీజిల్‌పై రూ.7 పెంచడం దారుణమనీ, దోపిడీ దొంగలు మాత్రమే ఇలా వ్యవహరిస్తారని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.రాంచందర్, వీఎస్‌రావు విమర్శించారు. బంకుల్లో లీటర్ డీజిల్ ధర రూ.94.65 పైసలుగా ఉందనీ, డైరెక్టుగా కొనుగోలు చేసే వారికి మాత్రం రూ.101.60 పైసలు ఉందని పేర్కొన్నారు. ఇలాగైతే ఆర్టీసీ లాంటి సంస్థలు లీటర్‌కు రూ.7 చొప్పున అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని కేంద్రం నిర్ణయం మరింత నష్టాల్లోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీపై రోజుకి రూ.42 లక్షలు, ఏటా రూ.154 కోట్ల భారం పడే అవకాశం ఉందని తెలిపారు. దీని ఫలితంగా గ్రామీణ, నగర ప్రాంతాల్లో ప్రజలకు బస్సుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్ నాటి డీజిల్ ధరలను స్థిరీకరించి పెరిగిన డీజిల్ ధరలను ప్రభుత్వమే భరించాలనీ, బల్క్బయ్యర్స్ పేరుతో పెంచిన డీజిల్ ధరను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.