Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇటీవల హోప్ అడ్వర్టయిజింగ్ స్టూడియోలో నిర్వహించిన 175వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరిస్తాయని 'సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్' (ఎస్ఐసీఏ) తెలిపింది. జంట నగరాల్లోని యువ సంగీత కళాకారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్ఐసీఏ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సాంసృతిక కార్యక్రమాల నిర్వహణలో పేరొందిన సంస్థగా ఎస్ఐసీఏకు గుర్తింపు ఉంది. 175వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో శ్రీరామ్, మహానంది వాసు శాస్త్రీ, కె.కృష్ణా శ్రవణ్, టిపిబిఎస్. బాలసుబ్రమణియన్ సంగీత ప్రదర్శన, మహీధర సీతారామ శర్మ కామెంటరీ అందర్నీ ఆకట్టుకుందని ఎస్ఐసీఏ తెలిపింది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమాన్ని వర్చువల్ మోడ్ ద్వారా ప్రసారం చేస్తున్నామని, యూట్యూబ్లో అందరూ వీక్షించాలని ఎస్ఐసీఏ కార్యదర్శి రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ కె.వి.రమణ, ట్రెజరీ సుదీంధ్ర కుమార్ మీడియాకు తెలిపారు.