Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోటిన్నరతో నూతన స్కూల్ భవన నిర్మాణం
- కేటీఆర్ ప్రణాళికను అందించిన టీఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మినరసింహారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'మన ఊరు-మనబడి' కార్యక్రమానికి దాతల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తున్నది. సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల అభివృధ్ధి కోసం ముందుకు రావాలంటూ సర్కారు ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్‌కు చెందిన టీఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మినరసింహారావు ఒక స్కూల్ భవనాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చారు. పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావుని హైదరాబాద్‌లో శనివారం కలిసి సిరిసిల్ల జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధిని చేస్తామంటూ భవన ప్రణాళికను అందజేశారు. ఆయన తండ్రి మాజీ మంత్రి చల్మెడ ఆనంద్‌రావు సొంత గ్రామమైన సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మలక్‌పేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సుమారు కోటిన్నర రూపాయలతో ఆ స్కూల్ భవన నిర్మాణాన్ని కార్పొరేట్ స్థాయిలో చేపడతామని వివరించారు. దాన్ని వేగంగా నిర్మించి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పూర్తి చేసి అందజేస్తామ తెలిపారు. ఒక ఉదాత్తమైన ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన 'మన ఊరు-మనబడి' కార్యక్రమంలో భాగస్వాముల య్యేందుకు ముందుకొచ్చిన లక్ష్మినరసింహారావును మంత్రి కేటీఆర్ అభినందించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను ఎంచుకుని అభివృధ్ధి చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.