Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెండోవి డుత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందా ర్ల సంఘం (జీఎంపీఎస్) డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల జంగయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ గొర్రెల పంపిణీలో 7.30లక్షల మంది గొల్ల కురుమలను లబ్ధిదారులగా ఎంపిక చేశారని గుర్తు చేశారు. ఇది జరిగి ఐదేండ్లు కావొస్తున్నప్పటకీ కేవలం 3.80 లక్షల మందికే పంపిణీ చేశారని తెలిపారు. డీడీ తీసిన వృత్తిదారులు ఇంకా 1,200 మంది ఉన్నారనీ, వారంతా గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.వృత్తి నిర్వహణలో మరణించే గొర్లకాపరులకు రూ 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవీకాలం ముగిసిన పెంపకందార్ల సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఫెడరేషన్‌కు అధిక నిధులు కేటాయించి గొర్లకాపరుల సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరారు. ఏప్రిల్ 17,18,19 తేదీల్లో సంఘం రాష్ట్ర మహాసభలు భువనగిరిలో నిర్వహించాలనీ, మార్చి నెల మొత్తం మందలవద్ద గొర్ల కాపరులను కలిసి సమస్యలు అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఎంవి రమణ, వివిధ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొల్లం అశోక్, కాడబోయిన లింగయ్య, దయ్యాల నర్సింహ్మ, మేకల నాగేశ్వరరావు, అవిశెట్టి శంకరయ్య, పరికి మధుకర్, మద్దెపురం రాజు, కట్రాల తిరుపతి రావు పాల్గొన్నారు.