Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఛత్రపతి శివాజీ 392వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోచమ్మ బస్తీ వాసులు శివాజి చిత్ర పటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొగల్ చక్రవర్తులకు దక్కన్ సుల్తాన్నలకు మధ్య ఏర్పడిన శక్తివంతమైన సామ్రాజ్యం మహారాష్ట్ర. ఈ సామ్రాజ్య స్థాపకుడిగా శివాజీని చెప్పుకోవచ్చు. కొడుకుకు చిన్ననాటి నుంచి భారత, రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టించిన ఆయన తల్లి గురించి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు గిరిధర్ గౌడ్, ధనుంజరు, మహేందర్నాథ్ గౌడ్, క్రాంతి, దినేశ్, మనిదీప్ గౌడ్, అచిని సాయి, సంపత్ గౌడ్, శిరీష్గౌడ్, దిలీప్, అరవింద్, అవినాష్, జయప్రకాశ్, సంకల్ప్గౌడ్, సుమంత్ గౌడ్, అజరుగౌడ్, సోనుయాదవ్, సన్నిగౌడ్, మనిదీప్ దడిగే, విశాల్, ఉపేందర్, భోజిరాజ్, రమేశ్ గౌడ్, శ్రీధర్‌గౌడ్, ఈశ్వర్, దేవేందర్, భాస్కర్ గౌడ్, నర్సింహా, శివ, దడిగె మురళి, కరుణాకర్ గౌడ్ తోపాటు ఇతర బస్తీ వాసులు పాల్గొన్నారు.