Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన మహాజాతర
నవతెలంగాణ-తాడ్వాయి/గోవిందరావుపేట
మేడారం మహాజాతర దిగ్విజయవంతంగా ముగిసింది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు శనివారం సాయంత్రం జనాన్ని వీడి వనంలోకి వెళ్లారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, వడ్డెలు కలిసి వనదేవతలను వనప్రవేశం చేయించారు. దీంతో నాలుగు రోజులుగా వైభవంగా సాగిన మేడారం మహాజాతర ముగిసింది. గిరిజన పూజారులు సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి తీసుకెళ్లి వారి వారి స్థానాల్లో ప్రతిష్టించారు. చివరి రోజు అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. అమ్మవార్ల ప్రవేశం సందర్భంగా కొద్దిసేపు గద్దెల వద్ద దర్శనాలను నిలిపివేశారు. ఆ తర్వాత గద్దెల వద్ద దర్శనాలను పునరుద్ధరించారు. ఈ సారి 1.30కోట్ల మంది సందర్శకులు వచ్చినట్టు అంచనా.