Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర సీఎం థాకరేతో భేటీ
- 21న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ప్రారంభం
- జాతీయరాజకీయాలపైనే ప్రధాన చర్చ
- ఆయనతోపాటు హరీశ్రావూ వెళ్లే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ముంబయికి వెళ్లనున్నారు. అక్కడ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్థాకరేతో భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపైనే వారి మధ్య చర్చ జరుగనున్నది. సీఎం కేసీఆర్‌తో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కూడా వెళ్లే అవకాశముందని ప్రచారం జరుగుతున్నది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ను థాకరే భోజనానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. భోజనం, చర్చల అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికీ వెళ్లనున్నారు. జాతీయ రాజకీయ అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. మరోవైపు ఈనెల 21 (సోమవారం) నారాయణ ఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను, బహిరంగసభ సభాస్థలిని మంత్రి హరీశ్‌రావు శనివారం పరిశీలించారు.