Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ప్రాచీన కళల పరిరక్షణకు తమ ప్రభుత్వము కృషి చేస్తున్నదని సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో స్వార్ మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 25న రవీంద్ర భారతిలో నిర్వహించబోయే 'సృజనోత్సవ్-2022'లోగోను మంత్రి గంగుల కమలాకర్, బీసీకమిషన్ చైర్మెన్ వకులాంభరణం కృష్ణమోహన్ రావు తో కలిసి అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సృజనోత్సవ్ పేరిట విద్యార్థులకు కళల పట్ల అవగాహన కల్పించేందుకు వీలుగా మ్యూజిక్, చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించి ప్రొత్సహిస్తున్న స్వార్ మహతి కళాపరిషత్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డా. ఆదిత్య కుమార్, మహేష్, వట్టికూటి రామారావు గౌడ్లు పాల్గొన్నారు.