Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 31 వరకూ అవకాశం
- జీవో నెంబర్ 58 కింద 125 గజాల దాక ఉచితం
- మార్గనిర్దేశకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను నేటి నుంచి రాష్ట్ర సర్కారు స్వీకరించనున్నది. మార్చి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర సర్కారు విడుదల చేసింది. జీవో నెంబర్ 58 కింద 125 గజాల దాకా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాలను నిర్ణీత రుసుముతో క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థల ఆధీనంలో ఉన్న భూముల క్రమబద్ధీకరణకు అవకాశముంది. మురికివాడల్లో మార్కెట్ విలువలో 10 శాతానికే ఇవ్వనుంది. దరఖాస్తుఫారంతో పాటు ఫొటోలు, ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, బ్యాంకు పాసుపుస్తకం, ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లుల రశీదు, నీటిబిల్లు, స్థానిక సంస్థల భవననిర్మాణ అనుమతి పత్రాల్లో ఏదో ఒకటి పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ భూములను పొందే పేదలు తరతరాలుగా అనుభవించే అవకాశం. ఇతరులకు విక్రయించడానికి వీల్లేదు. దీనికి సంబంధించి జీవో నెంబర్ 14 విడుదలైన విషయం తెలిసిందే. 58,59 కింద జారీ చేసిన ఉత్తర్వులకు లోబడి దరఖాస్తులు చేసుకోవాలి.