Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌కు రాజీనామాపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పార్టీలోని సీనియర్ల సూచన మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలనే తన ఆలోచనను 15 రోజులపాటు పక్కనపెడుతున్నట్టు ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) చెప్పారు. అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ను ఇప్పిస్తే.. తన బాధను చెప్పుకుంటానని తెలిపారు. వారిని కలిస్తేనే తన సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. సమయమిస్తే సోనియా, రాహుల్‌ను కలుస్తా, లేదంటే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. 'నేను పార్టీపైనా, పీసీసీ అధ్యక్షుడిపైనా అసంతృప్తిని వ్యక్తం చేస్తే... టీ కప్పులో తుఫాను అంటున్నారు తప్పితే, అసలు సమస్యకు మూలం ఎక్కడుందో తెలుసుకోవటం లేదు...' అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రాజకీయాల్లో భాగంగానే మహారాష్ట్ర ని కలిశారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం... కాంగ్రెస్‌తో కలిసున్న దేనని విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తాను బీజేపీ వ్యతిరేకంగా ఉన్నాననే ముద్ర కోసమే కేసీఆర్ ఈ విధంగా అందర్నీ కలుస్తున్నారని తెలిపారు.