Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర స్టీల్ శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్కు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ఆదివారం లేఖ రాసారు. బయ్యారంలో అపార ఖనిజ సంపద ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సంకల్ప లోపమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి శాపంగా మారిందని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కిన హామీని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. దేశంలోని ఇనుప ఖనిజ నిల్వలో సుమారు 11 శాతం బయ్యారంలోనే ఉందన్నారు. కొత్త ప్లాంట్ పెట్టే ఆలోచనే లేదన్న కేంద్ర ప్రభుత్వం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని పాత ప్లాంట్ల ఆధునీకరణ కోసం రూ.71 వేల కోట్లు ఖర్చు చేసిందనీ, బయ్యారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.చత్తీస్గడ్ నుంచి ఎన్ఎండీసీి ఐరన్ ఓర్ సరఫరా చేస్తామని హమీ ఇచ్చినా కేంద్రం కదలడం లేదని ఆక్షేపించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టలేమంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతమో, లేదంటే కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయమో చెప్పాలని ఆ లేఖలో కేంద్ర స్టీల్ మంత్రిని కోరారు.