Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
చేనేత పరిశ్రమపై కేంద్రప్రభుత్వం జీఎస్టీని రద్దుచేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. చేనేత పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలోకి నేడు తున్నదనీ, కార్మికులకు చేతినిండా పని, కష్టానికి తగిన ఆదాయం రావట్లేదన్నారు. పైగా ఈరంగంపై జీఎస్టీ విధించి మరింత వినాశనాన్ని సృష్టించారని విమర్శించారు. చేనేత కార్మికులు సమస్యల్ని చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను చూపించే జాతీయ చేనేత బోర్డుని రద్దు చేశారని చెప్పారు. ముడి సరుకులైన పట్టు, నూలు, రంగులు, రసాయనాల ధరలు గణనీయంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళి, ప్రధాన కార్యదర్శి బడుగు శంకరయ్య, జి భాస్కర్, గోశిక స్వామి, కూరపాటి రాములు గుండు వెంకట్ నర్సు, గుర్రం నరసింహ, రాజేష్, కూరపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా చెరుపల్లి సీతారాములును సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.