Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యాశాఖను విభజించి ప్రాథమిక విద్యకు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టీఎస్పీటీఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక రాష్ట్రాల్లో ప్రాథమిక విద్యకు ప్రత్యేక డైరెక్టరేట్లు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం విద్యాశాఖను విభజించి ప్రాథమిక విద్యకు ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయడానికి డ్రాఫ్ట్ విడుదల చేశారని గుర్తుచేశారు. ఆయన మరణంతో ఆ ప్రక్రియ అర్థంతరంగా నిలిచిపోయిందన్నారు. జీఓ 317 ను సవరించి స్థానికత ఆధారంగా పున్ణ కేటాయింపులు జరిపి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రెండేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయిందని, దానికి తగినట్టుగా ఉపా ధ్యాయులు లేకపోవడం వల్ల బోధనకు అనేక అవాంతరాలు ఎదురవ ుతున్నాయని చెప్పారు. సమావేశంలో నాయకులు నాగనమోని చెన్నరా ములు, అబ్దుల్లా అహ్మద్, ఆర్ మంగ, పి సుధారాణి, పి రాజయ్య, కత్తి నెహ్రూ, సయీద్ షాకిర్, ఆర్ రోహిత్ నాయక్ తదితరులు ప్రసంగిం చారు. రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం: రాష్ట్ర అధ్యక్షుడిగా సయ్యద్ షౌకత్ అలీ (ఖమ్మం జిల్లా), ప్రధాన కార్యదర్శిగా పిట్ల రాజయ్య (సిద్దిపేట జిల్లా) చీఫ్ ప్యాట్రన్‌గా పి విశ్వనాథ సత్యం ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు.