Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగర్‌కర్నూల్‌లో ఈ నెల 27,28 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు, విద్యాసదస్సు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటి విస్తృత సమావేశంలో ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. పదోన్నతులు, బదిలీల సాధనకోసం పోరాటానికి సిద్దపడతామని పేర్కొన్నారు. జీవో 317 ద్వారా జిల్లా స్థానికత కోల్పోయిన వారికి, భార్యాభర్తలకు వేర్వేరు జిల్లాల కేటాయించిన సందర్భంలో వారని ఒకే జిల్లా కేడర్‌గా మార్చే మరకు ఉద్యమిస్తామని తెలిపారు. దానికి అవసరమైన ఐక్యకార్యాచరణ చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యాసదస్సులో 'రాజ్యాంగ మార్పు అవసరమా' అనే అంశంపై ప్రొ. కె నాగేశ్వర్, ప్రొ.మాడభూషి శ్రీధర్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు కె సోమశేఖర్, బి.నర్సింహారావు, ఎ వెంకట్, ఎం రాజశేఖర్‌రెడ్డి, ఆర్ శారద, డి సత్యానంద్, జి నాగమణి, ఈ గాలయ్య, బి రాజు, కె రవికుమార్, జి. శ్రీధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఆవారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.