Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ప్రముఖ తెలుగు సమర యోధుల ఛాయాచిత్ర ప్రదర్శనను సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఓబీ), ప్రాంతీయ పాస్ పోర్ట్ కేంద్రం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను పత్రికా సమాచార కార్యాలయం (సౌత్ జోన్) డైరెక్టర్ జనరల్ ఎస్ వెంకటేశ్వర్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 'ఆజాదీ కా అమత్ మహౌత్సవ్'లో భాగంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు కొనసాగుతుందన్నారు. ఈ ప్రదర్శనలో కుమురంభీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానందతీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరులతో కూడిన 42 ఛాయాచిత్రాలు ఉన్నాయి. కార్యక్రమంలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం డిప్యూటీ పాస్పోర్ట్ అధికారి ఇందు భూషణ్ లెంకా, పత్రికా సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్. రవీంద్ర, ఆర్ఓబీ డైరెక్టర్ శతిపాటిల్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఐ. హరిబాబు, పీ భారతలక్ష్మి, ఎగ్జిబిషన్ అసిస్టెంట్ (ఇఐ) అర్థ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.