Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మర్యాదపూర్వకంగా సీఎంతో భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దండే విఠల్, భానుప్రసాదరావు, ఏసీ కోటిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం శాసనమండలిలోని ప్రొటెం చైర్మెన్ సయ్యద్ అమీన్యుల్ హసన్ జాఫ్రీ వారితో ప్రమాణం చేయించారు. వేర్వేరుగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరు భాస్కర్ ఆయా జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీలు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.