Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఈ రోజు మీటింగ్లో చెప్పిన మాటల్ని చూస్తే...ఇంటర్, పదో తరగతి ఫలితాలు వచ్చినప్పుడు కార్పొరేట్ విద్యాసంస్థలు టీవీల్లో ఇచ్చే 1, 2, 3, 4, 5...ర్యాంకులన్నీ మావే అనే యాడ్ చూసినట్టు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు కుమార్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ సభకు వెళ్లినా కోట్లు..కోట్లు..కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించుడు... ఆ తరువాత పైసలు రావు.. జీవో రాదు...ఇదీ పరిస్థితి అని విమర్శించారు. గ్రామపంచాయతీలకు నిధులిచ్చిన దాఖలాలు లేవన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ సహా అనేక పథకాల ద్వారా కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయని చెప్పారు.