Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల సంఘం రూపొందించిన 2022 డైరీని సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సివిల్ సప్లయిస్ ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతుగా విశేష సేవలందిస్తున్నారని అభినందించారు. ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని శాలువాతో సన్మానించి, జ్ణాపికను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు ఎం.గోపికృష్ణ, నేతలు ఎస్. రాఘవేంద్ర, రవి నాయక్, రీనా తదితరులు పాల్గొన్నారు.