Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.61.77 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు, ఇతరులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారి పెండింగ్ వేతనాల కోసం రూ.61.77 కోట్లు విడుదల చేశామని తెలిపారు. జనవరి నుంచి మార్చి వరకు వేతనాలు చెల్లించేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయడం పట్ల టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475 అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వి శ్రీనివాస్ హర్షం ప్రకటించారు. సీఎం కేసీఆర్, మంత్రి టి హరీశ్‌రావు, ఆర్థిక, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వేతనాల ప్రొసీడింగ్స్‌ను విడుదల చేయాలని ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌ను కోరారు. ఈ వేతనాల విడుదలకు సహకరించిన మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, టి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్థిక, విద్యాశాఖ అధికారులకు ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం గాదె వెంకన్న, కార్యదర్శి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.