Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ శాఖలు, సంస్థల ఖాతాల్లోంచి నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు ఆదేశాలకు విరుద్ధంగా, మోసపూరితంగా డిపాజిట్ల నుంచి నగదు తీయటం, అనుమతి లేకుండా కొత్త ఖాతాలు, ఫిక్స్్డ్ డిపాజిట్లు చేస్తున్న నేపథ్యంలో వాటిని అరికట్టటం కోసం ఆర్థికశాఖ సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సంబంధిత ఉత్తర్వులను ఆ శాఖ విడుదల చేసింది. ఈ నియమ నిబంధనలన్నింటిపై ప్రభుత్వం సూచించిన విధానంలో మార్చి 10 నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
మార్గదర్శకాలు...
- ప్రస్తుతమున్న ఫిక్స్డ్ డిపాజిట్లన్నంటినీ పూర్తిస్థాయిలో పరిశీలించాలి. వాటిని ఎంప్యానల్ చేసిన బ్యాంకులో ఒకే ఖాతాగా ఉంచాలి.
- ప్రభుత్వం ఎంప్యానల్ చేసిన బ్యాంకుల్లోనే ఖాతాలుండాలి.
- ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్న తర్వాతే బ్యాంకు ఖాతాలు, ఫిక్స్్డ్ డిపాజిట్లు తెరవాలి.
- ఆర్థికశాఖ నుంచి అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను ఫిక్స్్డ్ డిపాజిట్లలో జమ చేయకూడదు.
- బ్యాంకు ఖాతాలు, ఫిక్స్్డ్ డిపాజిట్ ఖాతాలను సంబంధిత శాఖాధిపతి, డ్రాయింగ్, ఫైనాన్స్ అధికారులు ఎప్పటికప్పుడు సంయుక్తంగా పరిశీలించాలి.
- భౌతిక, ఆన్లైన్ రికార్డులను ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయాలి.
- ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ లావాదేవీలను సంబంధిత శాఖల ఖాతాలకు ఎలక్ట్రానిక్ రూపంలోనే పంపుకోవాలి. నగదు లావాదేవీలను అనుమతించకూడదు.
- ప్రభుత్వ ఖాతాలన్నింటినీ అధికారిక ఈ-మెయిల్స్, మొబైల్ నంబర్లకు మాత్రమే లింక్ చేయాలి.
- ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు తదితరాంశాలను ఎప్పటకప్పుడు సరి చూసుకోవాలి.