Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసిన పార్టీ కాంగ్రెస్ : మురళీధర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోని విచ్ఛిన్నకర, అవినీతిపర శక్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమ్మక్కు అవుతున్నారని బీజేపీ నేత మురళీధర్‌రావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రతో తెలంగాణకు వెయ్యి కిలోమీటర్ల సరిహద్దుగల ప్రాంతం ఉందనీ, ఆ రాష్ట్ర సర్కారుతో పలు అభివృద్ధి, ప్రాజెక్టుల గురించి చర్చించిన అంశాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధిపై చర్చిండానికి వెళితే ఆయన వెంట సినీనటుడు ప్రకాశ్‌రాజ్ ఎందుకని ప్రశ్నించారు. దేశ సైనికశక్తిని అనుమానించిన వ్యక్తితో కేసీఆర్ స్నేహం ఏంటని నిలదీశారు. టీఆర్ఎస్ దాడులను బీజేపీగా ఎక్కడికక్కడా తిప్పికొడతామన్నారు. 356 అధికరణను అడ్డం పెట్టుకుని కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో సర్కారులను కూలదోసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి బయటపడుతుందనీ, మాఫియాల రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. వాటి నుంచి దృష్టి మరల్చేందుకే థర్డ్ ఫ్రంట్ పల్లవి ఎత్తుకున్నారని చెప్పారు. రాహుల్‌గాంధీకి ముళ్లు గుచ్చుకున్నా కేసీఆర్ స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. ఢిల్లీలో రాజకీయాలు చేయాలంటే ముందు తెలంగాణలో విజయం సాధించాలని హితవు పలికారు. గతంలో కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అన్నారనీ, ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను తెలంగాణ ప్రజలు ఓడించి తీరుతారన్నారు. డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఏవి? ఉద్యోగాల భర్తీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఏది? అని ప్రశ్నించారు.