Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మూగ జంతువుల పట్ల తన ఔదర్యాన్ని ప్రకటించింది. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని 15 పులులను దత్తత తీసుకుంది. పది సంవత్సరాల పాటు వీటికి అయ్యే వ్యయాన్ని భరించనుంది. ఇందుకోసం ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సోమవారం తెలంగాణ అటవీ శాఖ ముఖ్య కన్సర్వేటర్ ఆర్ శోభకు రూ.15 లక్షల విలువ చేసే చెక్కును అందజేశారు. పర్యావరణ ఆధారిత సమగ్రతకు ఎస్బిఐ ఎల్లప్పుడు పాటుపడుతుందని జింగ్రాన్ పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శన శాలల్లో హైదరాబాద్ ఒక్కటన్నారు.