Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో అవకతవకలకు సంబంధించిన నవతెలంగాణ ఫిబ్రవరి ఎనిమిదిన 'ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వీర్యం' ఫిబ్రవరి 13న ప్రచురించిన 'ఆమెను భరించలేం.....', 'హెచ్ఐవీతో చిన్నారుల జననాలు' కథనాలకు యంత్రాంగం కదిలింది. విడుదలైన నిధులకు సంబంధించి ఖర్చు చేసిన విషయాలతో యుటిలైజేషన్ సర్టిఫికేట్లను సమర్పించకున్న ఎన్జీవోల మళ్లీ మళ్లీ నిధులు విడుదల చేయడం వెనుక కేవలం అవినీతి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వరస కథనాలపై రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రీతిమీనా వివరణ కోరినట్టు తెలిసింది. మంగళవారం సాయం త్రం నాలుగు గంటలలోగా తనకు పూర్తి స్థాయిలో వివరణ పంపించాలని ఆదేశిం చారు. ఈ నేపథ్యంలో సొసైటీతో కలిసి పని చేస్తున్న ఎన్జీవోలతో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంగళవారం ఉదయం అంతర్గత సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇప్పటికైనా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారో లేదా జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు మార్గాలను అన్వేషిస్తారో చూడాలి.