Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతివేగంగా వస్తున్న కారు ఢకొీనడంతో..
- ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ చేవెళ్ల
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం స్టేజీ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న మూడు కార్లను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరం లింగంపల్లి ప్రాంతంలోని మయూరినగర్ కాలనీకి చెందిన గోలి రవికుమార్ వికారాబాద్ జిల్లా కరణ్కోట్లో నివాసం ఉంటూ నేడంలోని సీసీఐ(సిమెంట్) కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా రెండు రోజుల కిందట తన చిన్నపాప పుట్టిన రోజు కావడంతో భార్య పిల్లలతో కలిసి రవికుమార్ లింగంపల్లి వచ్చారు. తిరిగి సోమవారం విధులకు హాజరు అయ్యేందుకు చేవెళ్ల మీదుగా వికారాబాద్ జిల్లా కరణ్కోటకు తన భార్య స్రవంతి (30), కూతుర్లు.. మోక్ష, ధృవీక్ష (05)తో కలిసి ఆర్టో కారులో బయల్దేరారు. కేసారం గ్రామం స్టేజీ సమీపంలోకి రాగానే చేవెళ్ల మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా కారు అతివేగంగా ఎదురుగా వస్తూనే మొదటగా స్వీట్ కారును ఢ కొట్టింది. దాంతో స్వీట్ కారు పంచర్ అయ్యి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆ కారు వెనకాలనే వస్తున్న ఆల్టో కారుతోపాటు మరో కారును ఇన్నోవా కారు బలంగా ఢకొీట్టి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దాంతో ఆర్టో కారులో ఉన్న రవికుమార్, స్రవంతి, వారి పిల్లలు కారులో ఇరుక్కుపోయారు. గమనించిన స్థానికులు హుటహుటిన వారిని బయటకు తీశారు. అప్పటికే స్రవంతి(30), ధృవీక్ష(5) మృతిచెందారు. తీవ్రగాయాలైన రవికుమార్, మోక్షను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారు ముందు సీటులో కూర్చున్న యువకుడు సైయ్యద్ ఫైనల్ (21)ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇన్నోవా కారులో ఉన్న మరో ఐదుగురిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా మరో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న చేవెళ్ల సీఐ విజయభాస్కర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ నర్సింలు, ఎస్ఐ చందర్‌నాయక్, పోలీస్ సిబ్బంది క్షేతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై పడిపోయిన కార్లను జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్డం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.