Authorization
Fri March 28, 2025 11:36:52 pm
- గుండెపోటుతో ఇద్దరు మృతి
నవతెలంగాణ-రేగోడు/ టేక్మాల్
ఖేడ్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్తూ గుండెపోటుతో ఓ మహిళ, వ్యక్తి మృతి చెందారు. సభకు వెళ్తుండగా దారి మధ్యలో ఛాతిలో నొప్పి రావడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. సభకు చేరుకున్న తర్వాత భోజనం చేస్తుండగా గుండెపోటుకు గురై గిరిజన మహిళ మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగోడు మండలం పెద్దతాండాకు చెందిన రాథోడ్ శాంతాబాయి(40) బస్సులో బహిరంగ సభకు బయలు దేరింది. నారాయణఖేడ్ చేరుకున్న తర్వాత బస్సు దిగి భోజనం చేస్తూ కింద పడింది. అక్కడే ఉన్న తాండావాసులు హుటాహుటిన నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన లింగమయ్య(38) బహిరంగ సభ కోసం అందరితో కలిసి బస్సులో బయలుదేరారు. వట్పల్లి దగ్గరకి రాగానే ఛాతిలో నొప్పి వస్తుందంటూ పక్క వారికి చెప్పారు... వారు 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందారు.