Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ నేత శాంతకుమారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్యాగాలకు సిద్దపడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించడం సరైంది కాదని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) జాతీయ ఉపాధ్యక్షురాలు శాంతకుమారి అన్నారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల జర్నలిస్టుల కంటే ఎక్కువ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కర్నాటకకు చెందిన శాంతకుమారి మంగళవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రంలో ప్రభుత్వం జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నదనీ,.ఆ రాష్ట్రంలో అమలవుతున్న పలు స్కీంలను వివరించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ సదుపాయం కోసం ఫెడరేషన్ గట్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు శాంతకుమారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. రాంచందర్, కార్యదర్శి నర్సింగ్‌రావు, సలీమా, నేతలు పాండురంగారావు, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు.