Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేదల సంక్షేమం కోసం విరాళాలు అందించేందుకు పలువురు స్వచ్చందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ వెలమ అసోసియేషన్‌కు పలువురు విరాళాలు అందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కవితను నిజామాబాద్ వెలమ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఆ సంస్థకు ప్రేమసాగర్ రావు రూ. ఒక కోటి, అమరవాది హరికృష్ణ రూ. ఆరు లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ వెలమ సంఘం అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.