Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- నేడు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న సీఎం
- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి..
నవతెలంగాణ-తొగుట
గోదావరి నదికి నడక నేర్పిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగట మండలంలో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ నేడు (బుధవారం) ప్రారంభించనున్న నేపథ్యంలో ఎంపీ, జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సగం రాష్టాన్ని గోదావరి జలాలను పారించే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని హర్షం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ నుంచి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నీరు పంపే అవకాశమున్నదన్నారు. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఏ కాలంలోనైనా తాగు, సాగునీరు లేక కాలిన మోటర్లతో రోడ్లపై రైతులు ధర్నాలు చేసారని గుర్తు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీఎం కార్యక్రమం ఉంటుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు.. కేంద్రం నుంచి రాష్టానికి రావల్సిన నిధులను తీసుకురావాలని హితవు పలికారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఈఎన్సీ హారేరం, డీసీసీ చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఏరోళ్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితా లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ హరికృష్ణ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు జిడిపల్లి రాంరెడ్డి, దేవి రవీందర్, మాదాసు శ్రీనివాస్, రైతు బంధు మండల అధ్యక్షులు బోదనం కనకయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ వేల్పుల స్వామి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.