Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారుణ్య నియామకాలకు త్వరలో కమిటీ : టీజీవో నేతలకు సీఎస్ హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భార్యాభర్తలు ఒకేచోట పనిచేయాలనే నిబంధన ప్రకారం స్పౌజ్ కేసులకు సంబంధించిన బదిలీలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ సీఎస్‌ను మంగళవారం టీజీవో అధ్యక్షురాలు వి మమత నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. జోన్లు, మల్టీ జోన్ల పరిధిలో పరస్పర బదిలీలు కోరుకుంటే సీనియార్టీ పోకుండా చూడాలనీ, భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకేచోట పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన సీఎస్ పరస్పర బదిలీలు పాత జోన్లలో కోరుకుంటే సమస్యల్లేకపోతే సీనియార్టీని కాపాడుతూ ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాల జాప్యంపై అతిత్వరలో కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పీఆర్సీ బకాయిలపై జీవో విడుదల చేయడం సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఎస్‌కు వి మమత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, నాయకులు టి రవీందర్రావు, జి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణయాదవ్, రాజ్‌కుమార్‌గుప్తా, జగన్మోహన్రావు, హరికృష్ణ, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.