Authorization
Tue April 01, 2025 08:40:45 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్టీయూటీఎస్ ఐఈఆర్పీ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల పిల్లలకు సంబంధించిన సౌకర్యాలతోపాటు ఐఈఆర్పీల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీ యూటీఎస్ ఐఈఆర్పీ యూనియన్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎ కిరణ్‌కుమార్, కోశాధికారి సమ్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధరాచారి, నాయకులు రమేష్, స్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.