Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బహదూర్ పల్లి ప్రీ బిడ్ సమావేశం
- 25న తొర్రూర్ ప్రీబిడ్ సమావేశం
- మార్చి మూడో వారంలో ఈ ఆక్షన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్‌పల్లి, రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్‌లోని ప్లాట్లను ఆన్లైన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టిసి ఆధ్వర్యంలో వేలం(ఈ-ఆక్షన్) ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్? డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) సన్నాహాలు పూర్తి చేసింది. మల్టీ పర్పస్జోన్ కింద ఉన్న ఈ రెండు లే అవుట్లను హెచ్ఎండీఏ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నది. బహదూర్‌పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్‌లో 223 ప్లాట్లను మార్చి మూడో వారంలో విక్రయించనున్నారు. బహదూర్‌పల్లిలోని 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్లో 101 పాట్ల విక్రయాలకు సంబంధించి బుధవారం ప్రీబిడ్ మీటింగ్ జరుగనున్నది. బహదూర్‌పల్లిలో మేకల వెంకటేశ్ ఫంక్షన్హాల్లో ఉదయం పదకొండు గంటలకు ప్ర్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్‌లో 117 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నది. అందులోని 223 ప్లాట్లను ఈ ఆక్షన్ ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించి ప్రీబిడ్ మీటింగ్‌ను ఈనెల 25న తొర్రూర్ సైట్లోనే నిర్వహించనున్నారు.