Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) మాజీ అధ్యక్షులు సంగెం జంగయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ఇటీవలే మరణించిన జంగయ్య సంస్మరణ సభ యూనియన్ అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారంనాడిక్కడి మింట్ కాపౌండ్‌లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి, సీఐటీయూ నాయకులు కుమారస్వామి, టీఎస్‌పీఈఏ ప్రధాన కార్యదర్శి పి రత్నాకరరావు, టీఈఈఏ అధ్యక్షులు ఎన్ శివాజీ, బీసీ అసోసియేషన్ నాయకులు వెంకన్నగౌడ్, 1104 యూనియన్ ప్రధాన కార్యదర్శి జి సాయిబాబు, వర్కింగ్ అధ్యక్షులు సంగెం సుధీర్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, సేవల్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ మింట్ కాపౌండ్‌లో జంగయ్య విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. 1995-97 విద్యుత్‌రంగ సంస్కరణల సమయంలో ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు.