Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికలతో అసభ్య ప్రవర్తన
- మాట వినకుంటే చిత్రహింసలు
నవతెలంగాణ-చిట్యాల
విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడు వక్రబుద్ధి ప్రదర్శించాడు.. విద్యార్థినులను లైంగిక వేధింపుకు గురిచేశాడు. విద్యార్థులు అతను చెప్పిన మాట వినకుంటే చిత్రహింసలు పెట్టాడు. ఈ ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి ప్రాథమిక పాఠశాలలో వెలుగుచూసింది. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేపూరి నరసింహా. విద్యార్థినులతో లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అతని ఆగడాలు మిరిమీరడంతో విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. సిగరెట్, అగ్గిపెట్టె కిరాణా షాప్ నుంచి తెచ్చి ఇవ్వాలని, లేకపోతే చిత్రహింసలకు గురిచేసేవాడని తెలిపారు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించేవాడన్నారు. అతనికి భయపడి చాలా రోజులు విషయాలను గోప్యంగా ఉంచామని, వేధింపులు ఎక్కువవడంతో తల్లిదండ్రులకు చెప్పామని అన్నారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.. భయంతో కొందరు స్కూల్ మానేశారని చెప్పారు. ప్రధానోపాధ్యా యుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన విషయం తెలుసుకున్న ఎంఈఓ నర్సింహా..గుండ్రాంపెల్లి జడ్.పి.హెచ్ .ఎస్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్.నరసింహారావును పిట్టంపల్లి పాఠశాలకు పంపించారు. ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు.